kavacham subramayapuram next entiఅసలే చిన్న సినిమాలు…అందునా ఎన్నికల రోజున రిలీజ్…మరో పక్క హోరా హోరీగా జరిగిన ఎన్నికలు కావడంతో, కనీసం ఎక్కువశాతం రివ్యూస్ కూడా రాయలేదు…అసలు ఏంటి ఈ కన్ఫ్యూషన్ అనుకుంటున్నారా…

మ్యాటర్ ఏంటి అంటే నిన్న తెలంగాణలో ఎలక్షన్స్ నడుమ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి…తమన్నా “నెక్స్ట్ఏంటి”..బెల్లంకొండ శ్రీనివాస్ “కవచం”, అక్కినేని సుమంత్ “సుబ్రహ్మణ్య పురం”. అయితే ఈ మూడు డిఫరెంట్ జోనర్ సినిమాలు అయినప్పటికీ…సినిమా ట్రైలర్స్ లో ఉన్న ఆ కాస్త మ్యాటర్ సినిమాల్లో లేకపోవడం వల్ల…మూడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చేసిన శబ్దం ఎక్కడా వినిపించలేదు. మరో పక్క ఎలెక్షన్ హంగామా పుణ్యమా అని మీడియా సైతం ఈ సినిమాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

మొత్తంగా చూసుకుంటే యువ హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూడు సినిమాలు భారీ డిజాస్టర్స్ అని చెప్పక తప్పదు…అదీ నిన్నటి శుక్రవారం ‘సినిమా’ల కధ.