Kavacham movie USA premiers by redheart cinemasబెల్లంకొండ వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టైమ్ అస్సలు బాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే కధలు మంచివే పడుతున్నాయి, దర్శకులు బలమైన దర్శకులే సినిమాలు తీస్తున్నారు, ఇక నిర్మాతలు కూడా చిన్న హీరో కదా అని ఎక్కడా కాంప్రమైస్ కాకుండా బడ్జెట్ పెడుతున్నారు. కానీ ఈ కుర్ర హీరోకి పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల సినిమా మంచి టాక్ వచ్చినా బయ్యర్స్ నష్టాలలోనే మునిగిపోతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కుర్ర హీరో అందాల భామ కాజల్ అగర్వాల్ తో కలసి శ్రీనివాస్ మల్లెల దర్శకత్వంలో నవీన్ సొంటినేని నిర్మాతగా “కవచం”అనే సినిమాలో చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క బాక్స్ ఆఫీస్ ను రోబో షేక్ చేస్తుంటే, మరో పక్క డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని నిర్మాతలు వెల్లడించారు. రోబో సినిమాను చూసి కాస్త వాయిదా వేస్తారేమో అని అందరూ అనుకున్న క్రమంలో, అదేమీ లేదు, మేము చెప్పిన టైమ్ కే…ఆన్ టైమ్ లో వస్తున్నాం అంటూ నిర్మాతలు వెల్లడించడం విశేషం. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే…

ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్ లో కూడా విడుదల కావడానికి సర్వం సిద్దం చేసుకుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఈ హీరో సినిమాలు దాదాపుగా అన్నీ ఇప్పటివరకూ యూఎస్ మార్కెట్ లో రిలీజ్ అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కనీసం $100K మైలు రాయిని తాకలేదు అనే విని నివ్వెరపోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ టక్ తెచ్చుకున్న జయ జానకీ నాయకా కూడా ఇక్కడ పెద్దగా జనాలకు ఎక్కలేదు అంటే నమ్మి తీరాల్సిందే. మరి ఈ సినిమా అయినా మంచి హిట్ అయ్యీ ఆ $100K ట్రేడ్ మార్క్ ను అందుకుంటుందేమో చూడాలి. మొత్తంగా అదీ ఈ శ్రీనివాస “కవచం” కధా కమామి.