Kavacham-First-Lookబెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న “కవచం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. పోలీస్ డ్రెస్ వేసుకుని బెల్లంకొండ ఇచ్చిన స్టిల్ లో… హీరో గెటప్ వరకు ఓకే గానీ, పోస్టర్ డిజైన్ మాత్రం బి గ్రేడ్ ఫిల్మ్ మాదిరి కనిపిస్తోంది. ముఖ్యంగా ఫోటోషాప్ లో ఎడిట్ చేసిన పోస్టర్ మాదిరి ఈ ఫస్ట్ లుక్ ఉండడం శోచనీయం.

ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ మామిళ్ళ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఇప్పటివరకు టాప్ హీరోయిన్ల సరసన నటించిన బెల్లంకొండ, ఈ సినిమాలోనూ ‘చందమామ’ కాజల్ తో జతకట్టాడు. అలాగే మరో హీరోయిన్ మెహ్రీన్ కనువిందు చేయనుండగా, నీల్ నితీష్ ముఖ్ విలన్ గా నటిస్తున్నాడు.