Kaushal Manda  Charityబిగ్ బాస్ పేరు చెప్పగానే పది మందిలో 8 మందికి గుర్తుకు వచ్చే పేరు కౌషల్. ఆయన హౌస్ లో ఉన్నప్పుడు ఆ హౌస్ లో కన్నా బయట జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. సహజంగా టాప్ హీరోలకు అభిమానులు ఉండడం, ఆ క్రమంలోనే ఆ హీరోలకు మద్దతుగా ఆ అభిమానులు ర్యాలీలు చెయ్యడం, హడావిడి , హంగామా అంతా షరా మామూలే. కానీ ఒక కామన్ ఆర్టిస్ట్ అయిన కౌషల్ కి మద్దతుగా ఆయన బిగ్ బాస్ గెలవాలి అని కౌషల్ ఆర్మీ పేరుతో ఏర్పడ్డ యువత బెంగళూరు లాంటి మహా నగరంలో కూడా కౌషల్ గెలుపు కోసం ర్యాలీలు నిర్వహించడం విశేషంగా చెప్పవచ్చు.

సరే అన్నీ అనుకున్నట్లుగా కౌషల్ గెలవడం ఆ తర్వాత తన అభిమానులను కలవడం షరా మామూలుగా జరిగి పోయింది కానీ, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది అదేంటి అంటే, కౌషల్ తన ఆర్మీ తో కలసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అదే క్రమంలో చిన్న చిన్న సినిమాలు తీసి, ఆ సినిమాలకు వచ్చిన డబ్బులతో ఈ చారిటీని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి అని భావిస్తున్నాడట. ఐడియా బావుంది, మంచి పని కూడా అయితే సహజంగా సినిమాల్లోకి వచ్చే వాళ్ళంతా రూపాయి పెట్టుబడి పెట్టి, కోట్లాది కోట్లు సంపాదించెయ్యాలి అని ఆలోచన చేసే వాళ్లే ఎక్కువ శాతం. అప్పుడెప్పుడో విశ్వనాధ్ వంటి పెద్దల రోజుల్లో ప్యాషన్ కోసం సినిమా తీసేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ వ్యవహారం ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నదంతా నీకెంత నాకెంత అనే వ్యవహారమే. మరి ఇంత కాంపిటేషన్ ఉన్న ప్రస్తుత సినిమా ప్రపంచంలో చిన్న సినిమాకి ఊపిరి అందరి క్రమంలో ఆ చిన్న సినిమాలతో మరికొందరికి ఊపిరి పొయ్యాలి అన్న కౌషల్ ఆలోచన నిజంగా హర్షించదగ్గదే అయినా, సక్సెస్ అవుతుందో లేదో అన్న భయం మాత్రం నూటికి నూరు శాతం ఉంది.

ఇక మరో పక్క కౌషల్ తన భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఒకటి త్వరలోనే చెయ్యనున్నాడు. దానికి సంభందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. ఒక పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా, ఇంకో పక్క చారిటీని నడిపే దాతగా కౌషల్ ఎలా ముందుకు సాగుతాడో చూద్దాం.