kate-winslet reveals the relationship with leonardo-dicaprio-హలీవుడ్ లో అవార్డులు, రివార్డుల పరంగా సంచలనం సృష్టించిన ‘టైటానిక్’ నుంచి ఆ సినిమా హీరో లియోనార్డో డికాప్రియోతో తనకు అనుబంధం ఏర్పడిందని హీరోయిన కేట్ విన్ స్లెట్ తెలిపింది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి వీరి అనుబంధంపై ఎన్నో వార్తలు వెలువడ్డాయి. వీటిని వారిద్దరూ ఏనాడూ ఖండించలేదు పైగా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వారిద్దరూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఒక టీవీ షోలో దీని గురించి కేట్ విన్ స్లెట్ మాట్లాడుతూ… ‘టైటానిక్’ మూవీ తరువాత తమ ఇద్దరికి చాలా గుర్తింపు వచ్చిందని తెలిపింది. ఇప్పటికీ తామిద్దర్నీ గుర్తుంచుకునేందుకు కారణం ‘టైటానిక్’ మూవీయేనని తెలిపింది. ఆ షూటింగ్ సందర్భంగా ఏర్పడిన అనుబంధం నేటికీ కొనసాగుతోందని తెలిపింది. తామిద్దరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపింది.

ఇంకా వివరంగా చెప్పాలంటే డికాప్రియో తన కుటుంబంలోని వ్యక్తిలాంటి వాడని చెప్పింది. అతనితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని తెలిపింది. తామిద్దరిపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయని తెలిపిన ఆమె, ‘టైటానిక్‌’ క్లైమాక్స్‌ లో జరిగినదే నిజ జీవితంలో కూడా జరిగిందని తెలిపింది. కాగా, ‘టైటానిక్’ సినిమాలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జాక్ మరణించగా, అతనికి దూరమైన రోజ్ వేరే వ్యక్తిని వివాహం చేసుకుని జీవితం గడుపుతుంది.