katamarayudu-free-tickets-book-my-showపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా “కాటమరాయుడు” సినిమాకు సంబంధించి తొలి రోజున రాజమండ్రిలోని ఓ ధియేటర్ వద్ద ఉచితంగా టికెట్లను పంపిణీ చేసిన వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ‘బుక్ మై షో’ వంటి యాప్ లు ప్రతి టికెట్ పై రాయితీలను ప్రకటిస్తూ సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చెప్పుకుంటున్న ‘ఫ్రీ టికెట్లు’ లోకల్ గా కాదు, ఓవర్సీస్ లో ‘కాటమరాయుడు’ సినిమాకు స్థానికంగా లభిస్తున్న ‘బంపర్ ఆఫర్.’

ఓవర్సీస్ లో ఇప్పటివరకు 1 మిలియన్ డాలర్స్ ను అందుకున్న ఈ సినిమాకు మరింత మంది ప్రేక్షకులను రప్పించేందుకు “1+1” టికెట్ల ఆఫర్ ను ప్రకటించారు. ‘ఫండాంగో’ అనే యాప్ ద్వారా ‘కాటమరాయుడు’ చిత్రానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు కొనుగోలు చేసిన వారికి మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే, రీగల్ సినిమాస్, ఏఎమ్ సీ థియేటర్స్, సినీ మార్క్ థియేటర్స్ వద్ద ‘కాటమరాయుడు’ టికెట్లను ఒకటి కొంటే మరోటి ఉచితంగా ఇస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఎన్ఆర్ఐలు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారనేది కూడా ప్రశ్నార్ధకంగానే ఉంది.

ఎందుకంటే సినిమాలో మ్యాటర్ ఉంటే ఓవర్సీస్ ప్రేక్షకులకు టికెట్ల రేట్లతో గానీ, ఇలాంటి బంపర్ ఆఫర్లతో గాని పని ఉండదు. ఎంత పెట్టి అయినా తమకు కావాల్సిన సినిమాను వీక్షించేస్తారు, ఇదే సమయంలో సినిమా తమకు నచ్చకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా, దర్శకుడి సినిమా అయినా అటు వైపుకు కూడా చూడరు. అయితే ‘కాటమరాయుడు’కు ఫైనల్ గా యావరేజ్ టాక్ రావడంతో ఈ బంపర్ ఆఫర్ మరిన్ని కలెక్షన్స్ ను తెచ్చి పెడుతుందని పంపిణీ దారులు భావిస్తున్నారు.