pawan-kalyan-photoఅసలు ఉంటుందా? ఉండదా? అంటూ ఎన్నో సందేహాల నడుమ ఇటీవల ప్రారంభమైన “కాటమరాయుడు” సినిమా సెట్స్ లోకి పవర్ స్టార్ రంగప్రవేశం జరిగింది. రాజకీయ సభలంటూ ఇటీవల పవన్ చేసిన సందడి కాస్త తగ్గుముఖం పట్టడంతో, తన సినిమాపై దృష్టి కేంద్రీకరించిన పవన్ కళ్యాణ్… ఇటీవల బెంగుళూరులో నివసించి, ఫ్రెష్ లుక్ ను తెచ్చుకున్నారు. ఈ తాజా లుక్ ను చిత్ర నిర్మాత సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

‘కాటమరాయుడు’ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించాడని ఖరారు చేస్తూ… తెల్ల చొక్కా, పంచెలో టీ కప్పును పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను చూసిన అభిమానులకు ఇప్పటినుండే పండగ ప్రారంభమైనట్లుగా ఉంది. ‘ఫ్రిజ్ లో నుండి తీసిన పెరుగు కప్పు’లా ఫ్రెష్ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకు ముందు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో లుక్ కంటే విభిన్నంగా, అందంగా ఉండడంతో పవన్ కొత్త లుక్ ఫ్యాన్స్ కు కావల్సినంత కిక్ ను పంచుతోంది.

అలాగే ఈ లుక్ తో ఇప్పటివరకు ఉన్న సందేహాలు కూడా వీడిపోయాయి. పవన్ ‘కాటమరాయుడు’ సినిమా, అజిత్ తమిళ చిత్రం ‘వీరమ్’కు రీమేక్ అని ఇప్పటివరకు ప్రచారం జరిగినప్పటికీ, ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు. కానీ, ‘వీరమ్’లో అజిత్ లుక్ కూడా ఇలాగే తెల్లటి చొక్కా, పంచెతో ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో నిర్మాత శరత్ మరార్ రీమేక్ విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు.