పేదవాడికి సన్నబియ్యం అందిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన మాటలను మార్చుకుంటూ నోటికి పని చెపుతూ రెండున్నరేళ్ల సమయాన్ని వెల్లబుచ్చారు.సన్న బియ్యం అందిస్తానని మంత్రి సెలవుతీసుకున్నారని, ఇప్పుడు బియ్యానికి బదులు డబ్బులంటూ వచ్చిన మంత్రి తన జేబు నింపుకోవడమే కానీ పేదవాడి అవసరాన్ని తీర్చలేరంటూ విపక్ష పార్టీలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
పేదలకు పంపణీ చేస్తున్న రేషన్ బియ్యం అవసరం లేదనుకుంటున్న వారికి రేషన్ కి బదులు నగదు బదిలీ చేస్తామని కొత్తగా వచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజలకు కొత్త ఆఫర్లు ఇస్తున్నారు. రేషన్ కి బదులు నగదు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుబడుతున్నారు వైసీపీ ఎంపీ రఘు రామరాజు.
రేషన్ బియ్యానికి బదులు నగదు తీసుకున్న వ్యక్తులు తిరిగి ఆమొత్తాన్ని జగనన్న మద్యం దుకాణంలో జమ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈకొత్త స్కీమ్ ని ప్రవేశపెట్టిందంటూ విమర్శించారు. ఇంటింటికి రేషన్ అందిస్తామంటూ వేల సంఖ్యలో కొనుగోలు చేసిన వాహనాల సంగతేంటి అంటూ నిలదీస్తున్నారు వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్.
వాహనాల కొనుగోళ్ళకు కోట్లలో ఖర్చుచేసి ఇప్పుడు బియ్యం బదులు నగదు అంటూ ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన కష్టార్జితాన్ని పక్కన పెట్టటం ఎంతవరకు సబబు అంటూ నిలదీస్తున్నారు ప్రజానీకం.రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే జగన్ ఈ నగదు బదిలీ ప్రోగ్రాంకి బదిలీ అయ్యారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది.
పేదలకు అందించే రేషన్ ఒక కేజీ బియ్యానికి పది నుండి పన్నెండు రూపాయలు చెల్లిస్తామని తమకు ఇష్టమున్న వారు రేషన్ తీసుకోవచ్చని, అవసరం లేని వారు ఆ రేషన్ కు బదులు నగదు పొందవచ్చనేది ప్రభుత్వం పెట్టిన కొత్త విధానం.ఈ విధానంతో జేబులు ఖాళీచేసుకునే వారు ఎవరో జేబులు నింపుకునే వారు ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.