Karthikeya Guna 369 Teaser Talkఆర్ఎక్స్ 100 తో సెన్సషనల్ విక్టరీ సాధించిన కార్తికేయ రెండో సినిమా హిప్పీతో బాక్స్ ఆఫీసు వద్ద చతికిల పడ్డాడు. అయితే వెంటనే తన తదుపరి చిత్రం గుణ 369 తో తిరిగి ప్రేక్షకుల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నాడు కార్తికేయ. అయితే కాసేపటి క్రితం విడుదలైన ఆ చిత్రం టీజర్ నిరాశపరచింది అనే చెప్పుకోవాలి. ఒక సాధారణ మాస్ సినిమా లాగే ప్రేమ, కామెడీ, మాస్, పంచ్ డైలాగులు వంటి రొటీన్ అంశాలతో ఎటువంటి కొత్తదనం లేకుండా చప్పగా సాగింది.

టీజర్ ని బట్టి సినిమా ని అంచనా వెయ్యాల్సి వస్తే చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేనట్టే. అయితే ట్రైలర్ వచ్చాక మనం సినిమా పై ఒక నిర్ధారణకు రావొచ్చు. కార్తికేయ నటన రొమాంటిక్ సన్నివేశాలలోనూ, మాస్ ఎపిసోడ్స్ లోనూ ఆకట్టుకునేలా ఉంది. ఆర్ఎక్స్ 100 లాగా విషయం ఉన్న కథలు ఎంచుకుంటే ఖచ్చితంగా మంచి రేంజ్ హీరో అవుతాడు. కొత్త అమ్మాయి అనగ టీజర్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుంది. టీజర్ మొదట్లో వచ్చే సాయి కుమార్ వాయిస్ ఓవర్ ఆకట్టుకునేలా ఉంది.

మరోవైపు సినిమా గురించి సినిమా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గురించి చాలా హైప్ ఇస్తున్నాడు మన హీరో గారు. అయితే గుణ 369 రొటీన్ గా ఉన్నా కార్తికేయ గత సినిమా హిప్పీలా అతిగా అయితే లేదు. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడితే కార్తికేయ వన్ ఫిలిం వండర్ గా మిగిలిపోయే అవకాశం ఉంది.