అన్నయ్యపై చాంబర్ లో ఫిర్యాదు చేస్తా – కార్తీ!

Karthi -China Babuతమిళ స్టార్ హీరో సూర్య నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘చినబాబు’ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న హీరో కార్తీ మాట్లాడుతూ… “వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతికే పెద్ద కుటుంబంలో అందరి కంటే చిన్నవాడిగా నేను ఈ సినిమాలో కనిపిస్తాను. ఈ సినిమాలో నేను ఓ రైతుగా గోదావరి యాసలో మాట్లాడతాను. అన్నయ్య ఈ సినిమాకి నిర్మాత అయినప్పటికీ, దర్శకుడిపై గల నమ్మకంతో ఎప్పుడూ లొకేషన్ కి రాలేదు.

సినిమా ఎలా వచ్చింది అని అన్నయ్యను అడిగితే, ఆ విషయం నేను కాదు ప్రేక్షకులు చెప్పాలి అన్నాడు. నాకైతే ఈ సినిమాపై బలమైన నమ్మకం వుంది. ఈ సినిమాలో విలన్ ను ప్రత్యేకంగా చూపించడం ఉండదు. అదే ఊళ్లో మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి … విలన్ గా మారడం ఉంటుంది. మాది వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం వలన, మా ఇంట్లోని వాళ్లంతా ఈ సినిమా పట్ల ఆసక్తితో వున్నారు. ఇక ఈ సినిమా బాగా ఆడితేనే మా అన్నయ్య నాకు పారితోషికం ఇస్తానని అంటున్నాడు. ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేద్దామని అనుకుంటున్నాను” అంటూ నవ్వేశాడు.

Follow @mirchi9 for more User Comments
Allu Arjun Switches on to Fitness ModeDon't MissAllu Arjun Switches on to Fitness Mode'All is well when it ends well'. This is a popular quotation in English that...Airaa Movie Trailer TalkDon't MissTrailer Talk: Compelling Horror by the Lady SuperstarThe upcoming film of the south Indian Lady Superstar, Airaa is already carrying a great...Two-Mistakes-of-Pawan-Kalyan--in-24-HoursDon't MissTwo Mistakes of Pawan Kalyan in 24 HoursJanasena President Pawan Kalyan is darkhorse in these elections between two heavyweights like TDP and...KA-Paul-Mocks-Pawan-Kalyan-DanceDon't MissKA Paul Mocks Pawan Kalyan's DanceJust imagine KA Paul mocking Pawan Kalyan's signature dance steps! How would it be? In...Will Pawan -Kalyan Films Be Banned on TVDon't MissWill Pawan Kalyan Films Be Banned on TV?Election Commission has taken a surprising decision. It has banned the films of Sumalatha and...
Mirchi9