kaashmora-theatrical-trailer‘యుగానికొక్కడు’ సినిమా ద్వారా తెలుగు నాట పరిచయమైన తమిళ హీరో సోదరుడు కార్తీ నటించిన తాజా చిత్రం “కాష్మోరా” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను పడేసిన కార్తీ, ఈ ట్రైలర్ తో ఏకంగా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూసేలా చేసాడు. సోషియో ఫాంటసీ చిత్రాలను అమితంగా ఇష్టపడే సినీ ప్రేమికులకు ఈ “కాష్మోరా” పూర్తి సంతృప్తిని మిగిల్చేటట్లు కనపడుతున్నాడు.

హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఫస్ట్ విజిట్ లోనే ప్రేక్షకులను పడేస్తోంది. రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనపడుతున్న కార్తీ లుక్స్, అమోఘంగా దర్శనమిచ్చిన నయనతార, ఓం ప్రకాష్ ఫోటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యుద్ధ సన్నివేశాలు, గోకుల్ టేకింగ్ హైలైట్స్ గా నిలిచాయి. ఈ దీపావళి విడుదల కానున్న ఈ సినిమాను పివిపి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.