Kartha-Karma-Kriya-Movie-Theatrical-Trailerరాజమౌళి “RRR” ప్రకటించిన తర్వాత ఇదే క్రమంలో, సినిమాల వెల్లువ కనపడుతోంది. అందులో రవితేజ “AAA” ఒకటి కాగా, తాజాగా “KKK” కూడా చేరింది. “కర్త కర్మ క్రియ” పేరుతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో, లేటెస్ట్ గా ధియేటిరికల్ ట్రైలర్ వచ్చి చేరింది.

కాన్సెప్ట్ ను తెలుపుతూ వచ్చిన ఈ ట్రైలర్ లో… సినిమా కధ క్రిమినల్ చేజింగ్ లా కనపడుతోంది. వసంత సమీర్, సహర్ అఫ్శాలు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతుండగా, ప్రముఖ నటుడు రవి వర్మ పోలీస్ ఆఫీసర్ గా సినిమాలో అత్యంత కీలక పాత్ర పాత్ర పోషిస్తున్నాడు.

నాగు గవర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ‘మళ్ళీ రావా’ ఫేం శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. పాటల సంగతి పక్కన పెడితే, ఈ ట్రైలర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మాత్రం వినసొంపుగా లేదు. ‘జబర్దస్త్’ షో కమెడియన్లు ఈ సినిమాలో ఇతర పాత్రలలో కనిపించనున్నారు.