karnataka-elections-bjp-vs-congressకర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ మరోసారి విజయదుందుభి మోగించింది. తెలుగు దేశం మరియు కొన్ని ప్రజా సంఘాలు కోరుకున్నట్టు అక్కడి ప్రజలు బీజేపీని ఓడించలేదు. అక్కడి తెలుగువారు కూడా మమ్మల్ని అక్కున చేర్చుకున్న కన్నడ రాజ్యలక్ష్మే మాకు ముఖ్యమని తేల్చిచెప్పారు.

అయితే అదేమీ తప్పేమి కాదు. కన్న ఊరి కోసం ఉన్న ఊరుని నాశనం చేసుకోలేరు. అయితే ఇక్కడ తిట్టుకునేది బీజేపీ గెలుపును సంబరంగా జరుపుకుంటున్న కొందరిని. కేవలం చంద్రబాబు మీద ద్వేషంతో, చంద్రబాబు ఓడిపోయారు అని చూపించే ఆరాటంలో, రేపు చంద్రబాబు మీద మోడీ పగతీర్చుకుంటారు అనే ఆశతో కొందరు బీజేపీ గెలుపును ఆస్వాదిస్తున్నారు.

కొందరు అనే కంటే బీజేపీ వారితో పాటు జగన్ పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అని డైరెక్టుగానే చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే పరమావధిగా సాగడం వల్లే జాతీయ పార్టీలు మన రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి అనే చెప్పుకోవాలి. ఇలా రాష్ట్ర శ్రేయస్సు కోసం కూడా కలిసికట్టుగా పని చెయ్యలేని జనం ఉన్నంతవరకు మనల్ని ఎవరు మాత్రం పట్టించుకుంటారు?

కలిసి పని చెయ్యడం మాట దేవుడెరుగు ఒకరిని దెబ్బ కొట్టడానికి అన్యాయం చేసినవాడితో చెయ్యి కలపడం, వాడి గెలుపుని ఆస్వాదించడం ఇవన్నీ మన చేతితో మన కొంపకు నిప్పు పెట్టుకోవడం లాంటిదే.