Karnataka-Congress-JD(S)-Government-On-The-Verge-of-Collapseకర్ణాటక రాజకీయ సంక్షోభం ఈరోజు శాసనసభలో జరిగే బలపరీక్షలో తేలిపోతుందని అని అందరూ ఆశించినా అది జరగలేదు. సభలో బలనిరూపణకు సిద్ధమై ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ఉదయం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దానిపై సభలో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. అయితే ఈ తరుణంలో అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు సంకీర్ణం ఎత్తులు వేస్తోందని బీజేపీ దుయ్యబట్టింది.

దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను మళ్లీ వాయిదా వేశారు. తిరిగి 3 గంటలకు సభ ప్రారంభం కాగానే విశ్వాస తీర్మానంపై చర్చ మొదలుపెట్టారు. తమ పార్టీ చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆరోపించింది. అందులో ఒక ఎమ్మెల్యే శ్రీమంత్‌ పాటిల్‌ హాస్పిటల్‌ స్ట్రెచర్‌పై ఉన్న ఫొటోతో పాటు తాను తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో ఉన్నానని ఒక లేఖ పంపారు. అందుకే అసెంబ్లీకి రాలేకపోతున్నట్లు ఆ లేఖలో ఉంది.

అయితే దానిపై ఎలాంటి తేదీ గానీ, లెటర్ హెడ్‌గానీ లేదు. దానితో రేపటిలోగా దీనిపై నాకు నివేదిక ఇవ్వండి అని హోంమంత్రిని స్పీకర్ ఆదేశించారు. మరోవైపు విశ్వాస పరీక్షను కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సభలో ఆందోళనకు దిగారు. దీంతో అసహనానికి గురైన స్పీకర్‌ సభను రేపు ఉదయం వరకూ సభను వాయిదా వేశారు. ఎనిమిది మంది రెబెల్ ఎమ్మెల్యేలు గనుక బలపరిక్ష సమయంలో సభలో గనుక లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం దాదాపుగా ఖాయం అంటున్నారు.