Tornado, Telangana Tornado, Karimnagar Telangana Tornado, Powerful Telangana Tornado, Waterspout Telangana Tornado,  Telangana Wedge Tornadoసాధారణంగా అమెరికాలో మాత్రమే దర్శనమిచ్చే ‘టోర్నడో’లు తాజాగా తెలంగాణా రాష్ట్రంలోనూ తారసపడ్డాయి. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాలో హల్చల్ చేసిన ‘టోర్నడో’లను నేచర్ ప్రియులు తన కెమెరాలలో బంధించారు. డ్యాం క్రింద భాగంలో నదిలో ఈ ‘టోర్నడో’లు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణా వ్యాప్తంగా ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులే ఈ ‘టోర్నడో’ లాంటివి ఏర్పడడానికి కారణంగా తెలుస్తోంది.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలలో ఇలాంటి సీన్లను వీక్షిస్తూ ఉంటాం. అయితే ఇండియాలో మాత్రం చాలా అరుదుగా మాత్రమే కనపడుతుంటాయి. కానీ, ఇటీవల కాలంలో ఇలాంటి ప్రకృతి బీభత్సాలకు నిలయంగా ఇండియా మారుతుండడం గమనించదగ్గ విషయం. ప్రకృతి ప్రేమికులు ఇలాంటి వాటిని ఆస్వాదిస్తారేమో గానీ, ఇవి సృష్టించే కలకలం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ కరీంనగర్ టోర్నడోల వలన ఎలాంటి నష్టమూ జరగలేదు.