Karan Johar praises about south indian moviesరాష్ట్రాల వారీగా సినిమా ఇండస్ట్రీలు వివిధ పేర్లు పెట్టుకుని తమ హవా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ. దేశం మొత్తంగా చూస్తే ఆడీ ఇండియన్ సినిమాగా కీర్తి గడించాల్సిందే. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ కీర్తి అన్న పధం మనకి, అంటే దక్షిణ భారత దేశానికి కూడా చేరుతుంది. వినడానికి కాస్త కన్‌ఫ్యూసింగ్ గా ఉన్నా, అసలు మ్యాటర్ ఏంటి అంటే, గతంలో మన సినిమా మాలు దక్షిణాది సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలతో ఏ రకంగాను పోటీ పడేవి కావు. బడ్జెట్ ఏంటి…వసూళ్లు ఏంటి…స్టార్ఢం ఏంటి ఎలా ఏరకంగానూ మన వాళ్ళు బాలీవుడ్ స్టార్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లే వాళ్ళు కాదు. అదే క్రమంలో వేరే దేశాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమానా అనే వాళ్ళు. కానీ రోజులు మారాయి. హింది సినిమాలతో సమానంగా, ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి మన సినిమాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుదు ఇండియన్ సినిమా అంటే బాహుబలి? రోబో అనే రేంజ్ కి వచ్చింది.

అయితే సౌత్ ఇండియన్ సినిమా గురించి గొప్పలు నేను చెబుతుంది కాదండోయ్, మన ప్రఖ్యాత సినిమా మంత్రికుడు కరణ్ జోహార్ చెబుతున్న మాట. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్‌ప్లే రైటర్, ఇలా అన్ని రంగాల్లో తన మంత్రంతో బాలీవుడ్ సినిమాలో తన కంటూ ఒక పేజీ ఉంచుకున్న ట్యాలెంటెడ్ పర్సన్. అయితే మరో రెండు రోజుల్లో విడుదల కానున్న రోబో 2.0 సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే సౌత్ ఇండియన్ సినిమా బాలీవుడ్ సినిమాలను మించి పయనిస్తుంది అని కాస్త సంచలన వ్యాఖ్యలే చేశారు. అయితే రజనీకాంత్ సినిమా ప్రమోషన్ కోసం, తాను కొన్న ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సౌత్ ఇండియన్ సినిమాల గురించి కరణ్ పొగడడం కాదు కానీ ఆయన చెప్పింది మాత్రం అక్షరాల నిజమే.

ఎందుకంటే హిందీలో తాజాగా వచ్చిన ‘ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా 300 కోట్ల రూపాయలతో తెరకెక్కితే, మన రోబో 2.0 ఏకంగా 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక వసూళ్ల పరంగా కూడా బాహుబలిని చూశాం. రోబో పార్ట్1 చూశాం, మరో రెండు రోజుల్లో రోబో-2 చూడబోతున్నాం. అందుకే కరణ్ చెప్పింది అక్షరాల సత్యం అనే చెప్పాలి. అయితే ఈ మాటలు బాలీవుడ్ పెద్దలకు కాస్త బాధ కలిగించినా నిజం అబద్దం కాదుగా.