kanna laxminarayanacomments on polavaram Projectపోలవరం ప్రాజెక్టుకు సంబందించి కేంద్రం తాజాగా 1400 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, దీంతో ఆ ప్రాజెక్టుపై కేంద్రం ఒక్క పైసా కూడా బాకీ లేదని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే కన్నాది తెలియనితనం అయినా అయ్యుండాలి లేకపోతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమైనా ఆయన చేస్తుండాలి.

నిజానికి ఈ వారం వచ్చిన 1400 కోట్ల రూపాయిలు 2017-18కి గాను ప్రాజెక్టుపైన ఖర్చు పెట్టినవి. ఏప్రిల్ 1 నుండి ఇప్పటిదాకా మరికొంత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన మరో 766 కోట్ల బిల్లులు ప్రస్తుతం ప్రాజెక్టు అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ నిధులన్నీ కేంద్రం పాత డీపీఆర్‌ ప్రకారమే ఇస్తోంది. కొత్త డీపీఆర్‌కు ఆమోదముద్ర వేయలేదు.

పాత డీపీఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు సాగునీటి విభాగం అంచనా వ్యయం 12,294 కోట్లు. రాష్ట్ర విభజనకు ముందే దీనిపై 5,136 కోట్లు వెచ్చించారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమని లోగడే కేంద్రం స్పష్టం చేసింది. అదిపోగా మిగిలిన 7,158 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకూ ప్రస్తుత 1,400 కోట్లతో కలిపి 6,764 కోట్లు చెల్లించినట్లయింది.

ఇక మిగిలింది 395 కోట్లు మాత్రమే. ముందు రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం కొత్త డీపీఆర్ ను ఆమోదించేలా చూడాలి. అటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే మంచిది అంతేగానీ అబద్దాలతో ప్రజలను మభ్యపెడతాం అంటే ఇక్కడ కుదిరే అవకాశం లేదు. తెలుగు ప్రజలు మరి అంత తెలివి తక్కువ వారైతే కాదు.