Kanna -Lakshmi Narayanaఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య చురుగ్గా పెరుగుతోంది. నిన్న రాత్రి 9 గంటల నుండి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులను 226 కు తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో మాత్రమే 23 కేసులు నమోదయ్యాయి, చిత్తూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి.

అయితే ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రాజకీయ లెక్కలలో బిజీ అయిపోయాయి. పేదలకు ఇచ్చే 1000 రూపాయిల ఆర్ధిక సాయం స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఇప్పించి ఈ విషయాన్నీ మొత్తంగా రాజకీయం చేసేసింది అధికార పార్టీ.

కొన్ని చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంఛార్జ్లు కూడా డబ్బులు పంచారు. కొన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లు వేస్తామని ప్రజలతో ఒట్టులు కూడా వేయించున్నారు. మరోవైపు టీడీపీ దానిని తప్పుపడుతూ… అటువంటి వీడియోలతో ఎన్నికల సంఘాన్ని సంప్రదించే పనిలో పడింది.

ఇది ఇలా ఉండగా… బీజేపీ మరో అడుగు ముందుకు వేసి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బని అంటుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో … “సంక్షోభంలో కూడా స్వార్థ నీచ రాజకీయమా? కరోనావ్యాప్తితో దేశం,రాష్ట్రం తీవ్రఇబ్బందిలో ఉన్న ఈపరిస్థితుల్లో విపత్తునిర్వహణ కోసం కేంద్రం ఇచ్చిననిధులను సొంతనిధులుగా స్టిక్కర్ వేసి వాలంటీర్లతో కలిసి వైసీపీ కార్యకర్తలు తమపార్టీ ఇస్తున్నట్లు పంచడం చాలాదారుణం. బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది,” అంటూ స్పందించారు.