Kanna Lakshminarayanaఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీ నారాయణ కూడా ప్రజలతో సంబంధం లేని మాములు బీజేపీ రాష్ట్ర నాయకులాలనే మాట్లాడ్తున్నట్టు ఉన్నారు. “ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికిచ్చిన హామీల అమలుకు విభజన చట్టమే పదేళ్ల సమయం ఇచ్చింది.. ఇప్పటికి నాలుగేళ్లే కదా గడిచింది.. మిగతా గడువులోగా హామీలన్నీ పూర్తి చేస్తాం” అని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని మాత్రమే ఉంది, సమస్యలు పదేళ్ల వరకు పరిష్కరించొద్దు అని ఎక్కడా చెప్పలేదు. నాలుగేళ్ల సమయం వారికి కనీసం ఆస్తుల పంపకాలకు కూడా సరిపోలేదు అంటే బీజేపీ వారికి ఆంధ్రప్రదేశ్ పై ఉన్న శ్రద్ధ ఏ పాటిదో అర్ధం అవుతుంది.

కడప ఉక్కు పరిశ్రమపై మెకాన్‌ సంస్థకు సరైన సమచారం ఇవ్వలేదని.. భూములు, గనుల విషయంలో స్పష్టత లేకుండా రూ.వేల కోట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. అయితే ఈ విషయం ఇప్పటిదాకా కేంద్రం ఎక్కడా చెప్పకపోవడం విశేషం. ఇది కేవలం తప్పించుకోవడానికి బీజేపీ వాడుతున్న రాజకీయ విమర్శ అనే అనుకోవాలి.