kanna-lakshminarayana-fires-on-ys-jagan-Mohan-Reddyజగన్ సర్కారు మీద రాష్ట్ర బీజేపీ నెమ్మదిగా మాటల దాడి పెంచుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడిన నేతలనే ఈ పనికి కూడా ఆ పార్టీ హై కమాండ్ వినియోగించడం విశేషం. ఇక వివరాల్లోకి వెళ్తే…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు ఆత్రం, ఆవేశం ఎక్కువయ్యాయని విమర్శించారు.

టీడీపీ అయినా కొద్ది రోజులు ఆగింది కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ అప్పుడే బెదిరింపులు మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు. అనవసర విషయాల్లో అత్యుత్సాహం చూపే సీఎం జగన్‌… ఇసుక విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్వేధింపులకు నిరసనగా ఈనెల 16న పల్నాడులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దీనితో కొత్త ప్రభుత్వం పై బీజేపీ మొట్టమొదటి నిరసన కార్యక్రమం చేస్తుంది.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా ఇప్పటివరకూ ఎటువంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదు. దీనిబట్టి బీజేపీ జగన్ ను కూడా ఉపేక్షించకూడదని నిర్ణయనించుకున్నటు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఇంకోటి ఉంది… రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఒక పెట్టుబడుల ఆకర్షణ సభలో ప్రసంగిస్తూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తమకు కేంద్రప్రభుత్వం అండదండలు ఉన్నాయని చెప్పారు.