Kanna Lakshmi Narayana fires on print mediaవిశాఖపట్నం రైల్వే జోన్ అంశం రాజకీయ నిర్ణయం అని, దానిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ స్పష్టంగా జోన్ ఇస్తున్నామని చెప్పినా తర్వాత కొన్ని పత్రికలు కావాలని వ్యతిరేక రాతలు రాస్తున్నాయని బిజెపి ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తాము ఏమి పాపం చేశామని కొన్ని పత్రికలు ఇలా తప్పుడు రాతలు రాస్తున్నాయని అన్నారు.

సుప్రింకోర్టు అఫిడవిట్ లో కేవలం స్టాటస్ గురించే ఉంటుందని, కాని రాజ్యసభలో హోం మంత్రి రైల్వే జోన్ గురించి స్పష్టత ఇచ్చారని ఆయన అన్నారు.టిడిపి ఎమ్.పిలు కావాలని దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం వారు ఆ ప్రయత్నం చేస్తున్నారని, మరి పత్రికలకు ఏమి అవసరం ఏమి వచ్చిందని కన్నా ప్రశ్నించారు.

టిడిపి వారు తమపై పత్రికలలో వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని, పత్రికలు తాము ఎపికి చేస్తున్న అభవృద్దిని కూడా గమనంలోకి తీసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రైల్వే జోన్ పై కేంద్రం సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ కు విలువ ఉంటుందా లేక రైల్వే శాఖతో ఏ మాత్రం సంబంధం లేని రాజనాధ్ సింగ్ మాటలు ఎక్కువ విలువ ఉంటుందా? కేంద్రం చేసే తప్పులను ఇక్కడ పత్రికలు రాయకుండా ఉండాలంటే కేంద్రం తప్పులు చేయ్యకుండా ఉంటే సరేమో