బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరి పోయాయి. భాజపా కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ఎక్కడైనా పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగితే పోలీసులు అధికార పార్టీ నేతలను వదిలేసి ఇతర పార్టీల వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. భాజపా నేతలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి,” అని ఆయన ఆరోపించారు.
అయితే ఒంగోలులో ఇటీవలే ఒక ఆర్ఎంపీ డాక్టరు ప్రత్యేక హోదా గురించి ప్లకార్డు పట్టుకుని కన్నా ను ప్రశ్నించబోతే అతనిని బీజేపీ శ్రేణులు చితకబాదిన విషయం ఏమిటో? ఆ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా మీడియా, సోషల్ మీడియాలలో వచ్చింది. దానికి ఆయన ఇప్పటికి సంజాయిషీ ఇవ్వలేదు.
సొంత పార్టీ శ్రేణులను కనీసం కన్నా మందలించే ప్రయత్నమైనా చేశారా? లేక వారిని ప్రోత్సహించారా? తమ తప్పులు కప్పి పుచ్చుకుని టీడీపీ శ్రేణుల మీద కంప్లయింట్ చేసేస్తే న్యాయమా అది? మరో వైపు తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని కూడా కన్నా ఆరోపించారు.