hrithik-hits-back-at-the-Kangana Ranaut-bluntlyబాలీవుడ్ నటులు హృతిక్ రోషన్ – కంగనా రనౌత్ వివాదంలో సరికొత్త ‘ట్విస్ట్’ వెలుగు చూసింది. హృతిక్ రోషన్ ఈ – మెయిల్ అకౌంట్ నుండి తనకు ఈ – మెయిల్స్ వచ్చాయని కంగనా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఫోర్సెనిక్ నివేదిక స్పష్టం చేసింది. అసలు హృతిక్ నుండి కంగనాకు ఒక్క ఈ మెయిల్ కూడా వెళ్లలేదని ఈ నివేదికలో తేలడం విశేషం. అయితే ఇదే సమయంలో కంగనా రనౌత్ ఈ-మెయిల్ అకౌంట్ నుంచి 6 నెలల వ్యవధిలో దాదాపు 3 వేల ఈ మెయిల్స్ హృతిక్ కు వెళ్లాయని ఫోరెన్సిక్ నివేదిక తేటతెల్లం చేసింది.

హృతిక్ రోషన్ పేరుతో నకిలీ ఈ – మెయిల్ అకౌంట్ తో కంగనా రనౌత్ ను ఎవరో బోల్తా కొట్టించారని ఫోరెన్సిక్ విభాగం అభిప్రాయపడింది. కంగనాకు వచ్చిన హెచ్ఆర్ రోషన్@జీమెయిల్.కామ్ మెయిల్ ఐ.డి.తో హృతిక్ కు ఏ విధమైన సంబంధం లేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అలాగే హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా పరిశీలించిన పోలీసు విభాగం… ఏడేళ్లలో కేవలం నాలుగు సార్లే హృతిక్ కాల్ చేసారని తేలింది. కంగనాను కలిసేందుకు హృతిక్ పారిస్ కూడా వెళ్లలేదని, పాస్ పోర్టు కాపీలను బట్టి ధృవీకరణ అయ్యిందని, ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపినట్లుగా ఈ మేరకు ‘డీఎన్ఏ’ పత్రిక కథనం ప్రచురించింది.