kanam-karu-diya-movie-review-2ఏ . ఎల్. విజయ్త.. తమిళనాట పేరున్న దర్శకుడు. విక్రమ్ హీరోగా ‘నాన్న ‘సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడే. హాలీవుడ్ కథలను తమిళం లోకి దించేసే విజయ్, ఈ సారి థ్రిల్లర్ కథాంశంతో వచ్చాడు. ఈ దర్శకుడు తమన్నా తో ‘ అభినేత్రి ‘ థ్రిల్లర్ తీసాడు. తమిళ్ లో ‘దియా ‘ గా, తెలుగులో ‘కణం ‘ గా .. ఈ సినిమా 27వ తారీఖున విడుదల అయ్యింది.

కథ: కృష్ణ – తులసి 19 ఏళ్ళ వయసులోనే తొందరపడతారు.ఫలితంగా.. లలిత గర్భవతి అవుతుంది. ఇరు కుటుంబాలకి తెలిసి గొడవ అవుతుంది. అయిదు ఏళ్ల తరువాత కృష్ణ – తులసి ల పెళ్ళి అవుతుంది. అనూహ్యంగా .. వాళ్ళ కుటుంబీకులు చనిపోతుంటారు. ఎవరు హంతకుడు? దొరికాడా లేదా ? అసలు ఎందుకు చంపుతున్నాడు ? అనేది తెర మీద చూడాలి.

నటీనటులు: నాగసౌర్య నటించడానికి ఏమి లేదు. ఉన్నంతలో పాత్రకు సరిపోయాడు. సాయి పల్లవి సినిమా మొత్తం .. నీరసంగా, బాధగా కనిపిస్తుంది. సినిమా కథ ను బట్టి ఆమె ఆలా కనిపించింది. ఆమె నటనే ఈ సినిమాకి కొంత ఊపిరి. నీలాల్గళ్ రవి, సుజిత, ప్రియదర్శిపులికొండ, దియా గా నటించిన బేబీ వేరోనికా పర్వాలేదనిపించారు.

సాంకేతికవర్గం : ఈ సినిమాకి నీరవ్ షా కెమెరా ప్రధాన హైలైట్ కాగా, సామ్ . సి .ఎస్ అందించిన నేపధ్య సంగీతం మరో బలం. ఆర్ట్ వర్క్ ,ఎడిటింగ్ సూపర్బ్ గా ఉన్నాయి.సత్య అందించిన మాటలు గొప్పగా లేవు, పాటలు ఉన్నా లేనట్టే! ఏ . ఎల్. విజయ్ అందించిన కథ, కథనం ఈ సినిమా కి మైనస్ కాగా.. లాజిక్ లేకుండా హత్యలు జరగడం, చిరాకు తెప్పిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో తులసి చనిపోయి.. కూతుర్ని కలవడం. ఆ తరువాత పోలీస్ ఆఫీసర్ .. చనిపోయిన తులసి ని, హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లాడో ? విచిత్రంగా మళ్ళి ఆమె బ్రతకడం!. పోలీస్ ఆఫీసర్ ను మొదట్లో ఎందుకు పనికిరాని వాడిగా చూపించి .. హఠాత్తుగా బాధ్యత కలిగిన వాడిగా మారినట్లు చూపడం, ఆకట్టుకోదు. కథనం లో ఇలాంటి లోపాలు ఉన్నాయి. సినిమా ఇంటర్వెల్ తరువాత ఎం జరుగుతుందో.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు, ఇట్టె కనిపెట్టేస్తారు. ఇలాంటి థ్రిల్లర్స్ ప్రేక్షకుల ఊహలకు అందనట్లు ఉండాలి. అప్పుడే థ్రిల్ ఉంటుంది. ఈ ‘కణం ‘ అందరి ఊహలకు ఇట్టే అందేస్తుంది. అన్నట్లు 101 నిమిషాల నిడివి ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్.