kamli-kamli-video-song-payal-dev‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమాలో అల్లరి నరేష్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయం అయిన మాదసాల శర్మ, ఆ తర్వాత ‘శౌర్య, ఆలస్యం ఆమృతం, మేం వయసుకు వచ్చాం’ వంటి చిన్న చిన్న సినిమాలలో నటించింది. అలాగే మరో పక్కన బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది గానీ, ఎక్కడా సరైన గుర్తింపు లభించలేదు. గడిచిన రెండు సంవత్సరాలుగా అయితే ఏ భాషలోనూ నటించని ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఓ ప్రైవేటు సాంగ్ తో ఆడియన్స్ ను పలకరించింది.

‘కమ్లి కమ్లి’ అంటూ ఆలపించిన ఈ హుషారైన సాంగ్ లో హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఎక్స్ పోజింగ్ చేస్తూ కనిపించిన ఈ పాట వీక్షకులను ఆకట్టుకుంటోంది. టీ సిరీస్ ద్వారా ఇటీవల విడుదలైన ఈ పాటకు యూ ట్యూబ్ లో 4 మిలియన్ క్లిక్స్ రావడం విశేషం. బహుశా ఈ సాంగ్ తో అయినా తన ఫేట్ మారుతుందని భావించి, హాట్ హాట్ గా కనిపించేదేమో గానీ, పాటయితే ఆడియోతో పాటు వీడియో కూడా బాగుంది.