Kambhampati Hari Babu on visakhapatnam railway zoneవిశాఖపట్నం ఎంపీ, బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు హరిబాబు నాలుగేళ్లుగా ఒకే మాట మీద నిలబడుతున్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఆయన ఇదే మాట చెప్పడం పరిస్థితిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాకపోవడం విదితమే.

దీనితో పాటు విభజన తర్వాత ఏపీ అభివృద్ధి చెందిందని ఎంపీ హరిబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన హామీల అమలుకు మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటికే 85 శాతం హామీలను అమలు చేశామని, మిగిలిన హామీలను ఈ ఏడాదిలో అమలు చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.

విభజన చట్టంలో లేని వాటిని కూడా మోదీ అమలు చేశారని ఎంపీ హరిబాబు తెలిపారు. ఇటువంటి మాటలు మాట్లాడితే వచ్చే ఎన్నికలలో కనీసం పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి ఉందా హరిబాబు గారు? రాజకీయాల్లో ప్రజల మనసులు పని చేసి గెలుచుకోవాలె గానీ ఇలాంటి మాటలతో ఓట్లు పడిపోతాయి అంటే అది జరగని పని.