Kamal- Haasanకరోనావైరస్ ను ఎదుర్కోవటానికి విధించిన 40 రోజుల నేషన్వైడ్ లాక్డౌన్ పూర్తి చేయడానికి మనం ఇంకా తొమ్మిది రోజులు గడపవలసి ఉంది. ఆ తరువాత పొడిగింపు ఉంటుందో లేదో చూడాలి. యూనివర్సల్ హీరో కమల్ హసన్ కూడా ఈ లాక్డౌన్ కాలంలో మనలో ప్రతి ఒక్కరిలాగే తన ఇంట్లో ఉండిపోయారు. అయితే, ఈ లాక్‌డౌన్‌ను తాను నిజంగా పట్టించుకోవడం లేదని నటుడు చెప్పారు.

“మీరు ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ రకమైన లాక్‌డౌన్లు వ్యక్తిగత స్థాయిలో జరుగుతాయి. ఇది నాకు చాలా సార్లు జరిగింది. నేను 1990 లో నన్ను నేను లాక్ చేసుకున్నాను. నా కుటుంబాన్ని మిస్ అవ్వడంతో ఏడాది పొడవునా పని చేయలేదు. నేను పుస్తకాలు చదువుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాను. నేను ఈ లాక్‌డౌన్‌ను పట్టించుకోవడం లేదు ”అని కమల్ హాసన్ అన్నారు.

మొన్న ఆ మధ్య ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ సినిమాలు చెయ్యడం మానలేదు. ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. అయితే ఆ సినిమా సెట్ మీద జరిగిన ఒక ప్రమాదం కారణంగా ఆ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కంటే ముందే ఆగిపోయింది.

కమల్ కు ఆ సినిమా నిర్మాతలకు వచ్చిన విబేధాల కారణంగా ఆ సినిమా ఎలాగూ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దానితో లాక్ డౌన్ వల్ల నిజంగానే కమల్ కు ఇబ్బంది లేదు అనే చెప్పుకోవాలి. లాక్ డౌన్, కరోనా వైరస్ పై చర్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచుతున్నారు కమల్.