Kalyan Ram, Kalyan Ram Six Pack Poster, Nandamuri Kalyan Ram Six Pack Poster, Kalyan Ram ISM Six Pack Poster, Kalyan Ram ISM movie Six Pack Posterఓ పక్కన తమ్ముడు ‘జనతా గ్యారేజ్’ రూపంలో ధియేటర్లలో సందడి చేస్తుంటే… మరో పక్కన అన్నయ్య లేటెస్ట్ పోస్టర్ తో వచ్చేసాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న “ఇజం” సినిమా తాజా పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి ప్రధాన కారణం… కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లో వీర మాస్ లుక్ లో దర్శనమివ్వడమే!

తన తండ్రి నందమూరి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ… విడుదల చేసిన సిక్స్ ప్యాక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ మేకోవర్ అదిరింది అంటూ కితబిస్తున్నారు నెటిజన్లు. బిడి కాలుస్తూ మాస్ లుక్ లో కనపడుతున్న కళ్యాణ్ రామ్, ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయిన విషయం తెలిసిందే. గతంలో సింపుల్ లుక్ లో దర్శనమిచ్చిన కళ్యాణ్, తన తండ్రి పుట్టినరోజు నాడు మాత్రం ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే లుక్ లో కనపడ్డాడు.