Kalyaan-Dev-First-Look-Postersమెగా కాంపౌండ్ లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడం వలనో లేక పేరు మారిస్తే, రాత మారుతుందని భావించారో ఏమో గానీ, మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ పేరులో మార్పు చేసారు. త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న కళ్యాణ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో మరొక ‘ఎ’ అనే అక్షరాన్ని యాడ్ చేసిన విషయం తాజా పోస్టర్ ద్వారా స్పష్టమైంది.

ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ ఫస్ట్ లుక్ ను శనివారం నాడు మధ్యాహ్నం 3.30 నిముషాలకు విడుదల చేయబోతున్నామని తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైం క్లాసిక్ మూవీ “విజేత” టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను వారాహి ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.