Kalki Movie Teaserచాలా కాలం తరువాత గరుడవేగాతో విజయ సాధించారు సీనియర్ హీరో రాజశేఖర్. ఇప్పుడు మరో యువదర్శకుడితో కల్కి అనే సినిమా చేస్తున్నారు. ఈరోజు రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. గతంలో రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మాన్ అనే బిరుదు ఉండేది ఇప్పుడు అలా పిలుస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి దానిని యాంగ్రీ స్టార్ గా మార్చారు. ఒక ఫైట్ కు వచ్చే ముందు బిట్ ను రాజశేఖర్ ను యాంగ్రీ స్టార్ గా చూపించడానికి వాడారు. ఆ విషయం వరకు ఓకే గానీ అంతకు మించి టీజర్ లో ఏమీ లేదు.

రాజశేఖర్ సరికొత్త హెయిర్ స్టైల్, మీస కట్టుతో పోలీసు అధికారిగా కనిపించారు. 1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్రైమ్‌ బ్యాగ్రౌండ్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి కల్కితో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు రాజశేఖర్‌. సీనియర్ నిర్మాత సి కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మికలు సినిమాను తమ హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సమర్పిస్తున్నారు.

ఈ మూవీకి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్‌ మిగిలి ఉందని చిత్ర బృందం పేర్కొంది.‌ దేశంలోని వివిధ ప్రాంతాలలో షూట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ చిత్రం లో రాజశేఖర్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు – అదా శర్మ, నందిత శ్వేతా, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లు.