KALKI - Poster“పీఎస్వీ గరుడవేగ” సినిమాతో సక్సెస్ ఫుల్ గా రీ ఎంట్రీ ఇచ్చిన హీరో రాజశేఖర్, ఆ తర్వాత నుండి చాలా సెలక్టివ్ గా స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ వర్మతో కలిసి “కల్కి” సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో వీడియోను ఆవిష్కరించగా, ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఈ డిజైనింగ్ ఉంది.

భగవంతులకు సంబంధించిన అన్ని ఆయుధాలను, గుర్తులతో కూడిన “కల్కి” టైటిల్ లోగో అదిరిపోయింది. దానికి తగ్గట్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ‘ఇన్వెస్టిగేషన్ బెగిన్స్’ అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ వీడియో వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘అ!’ సినిమాతో తనలో క్రియేటివిటీని ప్రదర్శించిన ప్రశాంత్ వర్మ నుండి రాబోతున్న రెండో సినిమా ఈ “కల్కి.”