kalki - brochevarevaruఎప్పుడో ఏప్రిల్ లో విడుదలైన మహర్షి, మజిలీ సినిమాల తరువాత తెలుగులో చెప్పుకోదగిన సినిమాలు రాలేదు.. హిట్లు లేవు. చిన్న సినిమాలు విడుదల అవుతున్నా పెద్దగా ఆడటం లేదు. దీనితో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రేక్షకులు వాటివైపు కూడా చూడటం లేదు. ఈ క్రమంలో ఈ రోజు రెండు సినిమాలు – రాజశేఖర్ కల్కి, శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆది బుర్రకథ కూడా విడుదల కావాల్సి ఉన్నా చివరి నిముషంలో వాయిదా పడింది.

కల్కి మొదటి నుండి మంచి ట్రైలర్లతో బయ్యర్లలో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించింది. అయితే సినిమా బీలో యావరేజ్ అంటూ టాక్ వస్తుంది. మరోవైపు బ్రోచేవారెవరురా సినిమాకి ఓ మోస్తరుగా మంచి టాక్ వచ్చినా సినిమాకి ప్రేక్షకులలో పెద్దగా బజ్ లేదు. మౌత్ టాక్ బాగా పని చేస్తే తప్ప పని జరిగే అవకాశం లేదు. అది చాలా వరకూ అనుమానమే. దీనితో ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి లేదనే చెప్పుకోవాలి. దీనితో అందరి చూపు వచ్చే వారం వచ్చే సమంత ఓ బేబీ మీదే ఉంది.

దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అయిన ఈ సినిమాకు మహిళా దర్శకురాలు బీవీ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. డి.సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మాతలు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందనే చెప్పుకోవాలి. సమంత కూడా ఈ సినిమా ప్రొమోషన్లకు గట్టిగానే కష్టపడుతుంది. ఈ సినిమా అయినా ఆడుతుందేమో చూడాలి.