Kalavakuntla kavitha rajya sabha మార్చి లో ఖాళీ అయ్యే 55 రాజ్య సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు, తెలంగాణకు రెండు స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలు వీటిని దక్కించుకుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎమ్.పి కవితకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వవచ్చని కొన్ని కథనాలు వస్తున్నాయి.

ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆమె ఓటమి చెందారు. గతంలో కవితకు సీటు ఇచ్చే విషయంలో కేసీఆర్ వెనుకంజ వేస్తున్నారని ప్రచారం జరిగింది. కాని కవితకు రాజ్యసభ పదవి ఇవ్వాలని కేసీఆర్ పై పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం. కవిత రాజకీయాలలో యాక్టివ్ గా ఉండడం పార్టీకు ఉపయోగమని వారు వాదిస్తున్నారు.

అందువల్ల వచ్చే రెండు సీట్లలో ఒకటి కవితకు కేటాయింవచ్చని చెబుతున్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాధం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు కూడా రేసులో ఉన్నారు. దీనితో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ కు దక్కే నాలుగు సీట్లలో ఒకటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు రాజ్యసభ సీట్లలో తమ కుటుంబసభ్యులకు పెద్దపీఠ వేసినట్టు అవుతుంది.