kalaniketan-md-leela-kumar-arrested-in-cheating-caseప్రముఖ వస్త్ర దుకాణం “కళానికేతన్” ఎండీపై హైదరాబాదు సీసీఎస్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద తీసుకున్న 3.70 కోట్ల అప్పు చెల్లించలేదంటూ జూబ్లీ హిల్స్ కు చెందిన ఏవీఎన్ రెడ్డి అనే ఫైనాన్షియర్ ‘కళానికేతన్’ ఎండీ లీలాకుమార్ పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆ వెంటనే లీలాకుమార్ దంపతులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

హోల్‌సేల్ వ్యాపారులను, బ్యాంకులను 100 కోట్ల రూపాయలకు వరకు లీలాకుమార్ మోసం చేసినట్లుగా కధనాలు వెలువడుతున్నాయి. దీంతో ఎండీ లీలాకుమార్, ఆయన భార్య లక్ష్మీశారదను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ కళానికేతన్‌ షాపింగ్ మాల్స్ వున్న సంగతి తెలిసిందే.