Kalabhavan Maniదక్షిణాది చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, తెలుగులో ‘జెమిని’ చిత్రం ద్వారా ప్రజాధరణ పొందిన కళాభవన్ మణి అంత్యక్రియలు సోమవారం నాడు స్వస్థలం కేరళలోని త్రిశూర్ జిల్లా చలక్కుడిలో పూర్తయ్యాయి. అయితే, అంత్యక్రియలు పూర్తికాక ముందే మణి కాలం చేసిన వైనంపై పలు సందేహాలు తలెత్తాయి. దీంతో వేగంగా స్పందించిన పోలీసులు అంత్యక్రియలకు ముందే మణి మృతదేహానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ సందర్భంగా మణి శరీరం నుంచి పలు శాంపిళ్లను సేకరించిన వైద్యులు, వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తరలించారు. ఇదిలా ఉంటే, పోస్టుమార్టం సందర్భంగా మణి శరీరంలో అనుమానాస్పద రసాయనాలున్నాయన్న వైద్యుల సందేహాలతో రంగంలోకి దిగిన పోలీసులు మణి మృతిని అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

మణి మరణించిన అవుట్ హౌస్ ను పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. మణి మరణం విషయంలో జరిగిన ఉదంతంతో కేరళ సినీ వర్గాల్లో కలకలం రేగింది. దీని వెనుక ఎవరి కుట్ర అయినా దాగి ఉందా? లేక మణి ఆత్యహత్య చేసుకున్నారా? అనే విధంగా శాండిల్ వుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుతున్నాయి.