Kajal Aggarwal Stunning lookజీ తెలుగు అప్సర అవార్డ్స్ కు తెలుగు సినీ పరిశ్రమ అప్సరసలంతా తరలివచ్చారు. టాప్ హీరోయిన్లు తమన్నా, కాజల్, శృతిహాసన్ దగ్గర నుండి వర్ధమాన నటీమణులు అపూర్వ వరకు, ఈ వేడుక అంతా ముద్దుగుమ్మలతో నిండిపోయింది. ఆకాశంలో చుక్కల నడుమ ‘చందమామ’ ఎలా అయితే మెరిసిపోతుందో, ఈ అప్సర వేడుకలో కలువకళ్ళ ‘చందమామ’ కూడా అలాగే తళతళలాడిపోయింది.

చూపు తిప్పుకోవడానికి అవకాశం ఇవ్వనంతగా బ్లాక్ గౌన్ లో తన బ్యూటీనంతా ప్రదర్శించింది కాజల్. ఈ వేడుక మొత్తానికి హైలైట్ గా అందరినీ ఆకర్షించిన బ్యూటీగా కాజల్ అగర్వాల్ నిలిచిపోయింది. హాట్ అండ్ స్టన్నింగ్ లుక్ లో ఉన్న ఈ కాజల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతఅందంగా ఉంటే అంత హంగామా చేయడంలో తప్పులేదులే అనడం నెటిజన్ల వంతు!