Kajal Aggarwal Poland Summer Latestటాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగి, ఆ దశ నుండి క్రిందికి వస్తున్న ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పోలాండ్ లో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు లేకుండా పోవడంతో, టాలీవుడ్ కు దూరంగా ఉంది కాజల్. అలాగని బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా బిజీగా లేదు.

సినిమాల పరంగా దూరంగా జరిగినా, సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ లేక్ పక్కన నిల్చుని ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జీన్స్ లోయర్ షార్ట్ తో తన లెగ్ సౌందర్యాలు కనిపించేలా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే ఫోజిచ్చింది కాజల్. నది పక్కన ఓ పాలరాతి లాంటి శిల్పం చేక్కినట్లుగా ఉన్న ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.