Kajal-Aggarwal-Latest-Photoకంగనా రనౌత్ “క్వీన్” సినిమా రీమేక్ గా తెరకెక్కుతోన్న “పారిస్ పారిస్” సినిమాలో ప్రధాన పాత్రను ‘చందమామ’ కాజల్ అగర్వాల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన షూటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేసాయి. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ లుక్ కు అంతా ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమా నుండి మరో స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్ లుక్ లో కనపడుతోన్న కాజల్, చాలా అందంగా ఉంది. చక్కనమ్మ చిక్కడం వలన ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఈ ఫోటోను చూసి చెప్పవచ్చు. ఈ పిక్ ను చూస్తుంటే… వీక్షకులకు నాటి ‘చందమామ, మగధీర’ రోజులు గుర్తుకు రావడం సహజం. బహుశా ‘పారిస్ పారిస్’ తర్వాత ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ అవకాశాలు క్యూ కడతాయేమో చూడాలి.