Kajal Aggarwal Birthday Teaser Nene Raju Nene Mantriవిలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రానా హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం “నేనే రాజు నేనే మంత్రి” సినిమా ఫస్ట్ టీజర్ ఇటీవల విడుదలై వీక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన దర్శకుడు తేజ, తాజాగా ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా… జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ… మరో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

సరిగ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికే ఈ సన్నివేశాన్ని రూపొందించినట్లుగా… కాజల్ కళ్ళకు గంతలు కట్టి, సర్ ప్రైజ్ ఇస్తున్నట్లుగా… ఒంటి నిండా నగలు తొడిగిన రానా, ‘నా పేరు రాధా జోగేంద్ర… రాధ లేనిదే జోగేంద్ర లేడు…’ అనే డైలాగ్ ను వదిలారు. పట్టుచీర కట్టుకుని, ఒంటి నిండా నగలతో నిజంగానే ఆకాశంలో ‘చందమామ’ మాదిరి దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘పర్ ఫెక్ట్ బర్త్ డే టీజర్’ అంటే ఇది అనిపించేలా మురిపించాడు తేజ.