kajal-marriage-details‘చందమామ, మగధీర’ల తర్వాత టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం కెరీర్ ముగుస్తుందనుకున్న తరుణంలో ఈ ఏడాది ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలను విడుదల చేసి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్న కాజల్ పెళ్లి విశేషాలు వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన కంటే చిన్నదైన సోదరి నిషా అగర్వాల్ వివాహం చేసుకోవడంతో, కాజల్ పరిణయం ఎప్పుడన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో నెలకొని ఉంది.

ఈ విషయమై కాజల్ తన సన్నిహితుల వద్ద స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా వెబ్ అండ్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ రెండేళ్ళ పాటు సినిమాలు చేసిన పిదప, ఇక సినిమాలకు పూర్తిగా చెక్ పెడుతూ… వ్యక్తిగత జీవితానికే పరిమితం అయిపోతానని కాజల్ చెప్పినట్లుగా టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే… గత కొన్నాళ్ళుగా కాజల్ ఓ బిజినెస్ మెన్ తో ప్రేమాయణాలు సాగిస్తున్నట్లుగా వస్తున్న వార్తల గురించి తెలిసిందే.