Kaikala Satyanarayana Health conditionతెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాతకాలం దిగ్గజ నటులలో కైకాల సత్యనారాయణ చాలా ప్రముఖులు. ఏ రకమైన క్యారెక్టర్ ను అయినా అవలీలగా వెండితెర మీద పండించే కైకాల, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే.

వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న కైకాల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హాస్పిటల్ వర్గాలు బులిటెన్ ను విడుదల చేస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సమాచారం మాత్రం కొంత ఊరటనిచ్చే విధంగా ఉంది.

స్పృహలోకి వచ్చిన కైకాల సత్యనారాయణను క్రిటికల్ కేర్ విభాగం డాక్టర్ సుబ్బారెడ్డి ద్వారా పలకరించానని, నేరుగా మాట్లాడలేకపోయినా, ‘కోలుకున్న తర్వాత అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’ అన్న దానికి ‘థమ్సప్’ అంటూ సత్యనారాయణ గారు చూపించినట్లుగా మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాలలో ఎలాంటి రోల్స్ ను చేయలేకపోయినా, కైకాల అనే ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ చిరస్థాయిగా ఉంటుంది. రాజకీయ రంగంలోనూ రాణించిన కైకాల పూర్తి ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి తిరిగి రావాలని మనమూ ఆశిద్దాం.