Kadiyam-Temple-Decorated-With-YSRCP-Colorsవైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎన్ని మొట్టికాయలు పడుతున్నా, ప్రతిపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నా ఆ పార్టీ నేతల తీరు మారడం లేదు. సచివాలయాలు, నీళ్ళ ట్యాంకులు, గృహ సముదాయాలకు చివరికి ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెలకి వైసీపీ రంగులు వేయిస్తూ విమర్శల పాలవుతోంది. అసలు భవనాలకు, కరెంటు స్తంభాలకు పార్టీ రంగులు వేయించినంత మాత్రన్న ప్రజలు వాటిని చూసి మళ్ళీ వైసీపీకి ఓట్లు వేస్తారనుకొంటోందా లేకపోతే రాష్ట్రమంతా వైసీపీ రంగులతో నింపేస్తే అంతటా వైసీపీయే ఉందని ప్రజలు నమ్మేసి మళ్ళీ ఒట్లేస్తారా?అంటే కాదని వైసీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కనుకనే సంక్షేమ పధకాల పేరుతో ఎడాపెడా డబ్బులు పంచిపెడుతూ, ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. మరైతే అన్నిటికీ వైసీపీ రంగులు ఎందుకు వేస్తోందంటే బహుశః ప్రజలపై ఎంతో కొంత ఆ ప్రభావం పడుతుందనే ఆశతోనే కావచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రంలో శివాలయాలన్నీ అందంగా విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పండుగల సందర్భంగా దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడం సర్వసాధారణమే కానీ తూర్పుగోదావరి జిల్లా కడియంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ పాలక మండలికి వైసీపీ నేత ఛైర్మన్‌గా ఉండటంతో ఆలయాన్ని వైసీపీ రంగుల విద్యుద్దీపాలతో అలంకరింపజేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఆలయపాలక మండలి వాటిని మార్చడంలేదు. చివరికి దేవాలయాలకు కూడా రాజకీయ మురికిని అంటించడాన్ని ఏమనుకోవాలి?