Kadiri CI Gorantla - Madhav - YSRCP - YS Jaganకొద్ది రోజుల క్రితం కదిరి సీఐ గోరంట్ల మాధవ్ సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైనే మీసం మెలేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆయన తన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఈరోజు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గతంలో ఊహించినట్లుగానే నేడు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే హిందూపూర్ పార్లమెంట్ సీటు నుండి ఆయనను నిలబడతారని ప్రచారం జరగడం విశేషం.

పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది మొదలు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. ఆ కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. దీనిని వాడుకోవాలని ప్రతిపక్ష పార్టీ భావిస్తుంది. కర్నూల్ జిల్లాకు చెందిన మాధవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని మాధవ్‌ను వైసీపీ హైకమాండ్ కోరడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేడు వైకాపాలో చేరారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించినది మొదలు జరిగిన తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు ఐదు సార్లు గెలిచారు. 2009 నుండి నిమ్మల కిష్టప్ప వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ సారి కూడా ఆయనే తెలుగుదేశం అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థిని మాధవ్ ఢీ కొట్టగలరో లేదో చూడాలి. ఇదే సమయంలో ఆయనను ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనను మీడియాలో కూడా బాగా వాడుకోవాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ భావిస్తుంది.