kadapa YSRCP leaders arguements with ICDS project directorవైసీపీ నాయకుల వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వీఓఏ నాగలక్ష్మి ఉధంతం మరువక ముందే కడపలో జరిగిన జడ్పి సమావేశంలో ఓ మహిళా ఉద్యోగిపై వైసీపీ నాయకుల తీరు విమర్శల పాలవుతోంది. అంగన్వాడీ ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగాయంటూ ఐసిడిఎస్ పీడీ పద్మజపై ముప్పేట విమర్శల దాడి చేశారు వైసీపీ నేతలు.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా., జిల్లా ఇంచార్జి ఆదిమూలపు సురేష్., ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి., మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఇలా తదితర వైసీపీ ముఖ్య నాయకులు కలెక్టర్ విజయరామరాజు సాక్షిగా పద్మజపై విరుచుకుపడ్డారు. కడపలో ఏ ఒక్కఅంగన్వాడీ పనితీరు సక్రమంగా లేదంటూ “నువ్వు నిజాయితీ పరురాలివా ?” అని వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు.

అందుకు మహిళా ఉద్యోగి కూడా “అవును” అంటూ గట్టిగానే బదులిచ్చేసరికి ఆవేశంతో శ్రీకాంత్ రెడ్డి ఊగిపోయారు. ఉద్యోగ నియామకాలలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే ప్రశ్నించాల్సిన తీరు ఇదేనా అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పని తీరు సరిగా లేకపోతే తమపై రాజకీయ నాయకులు చూపే ప్రతాపాన్ని ప్రజలు కూడా వారి పై చూపితే ఈ రాజకీయ నాయకులు సహిస్తారా? అంటూ తమలో తామే ప్రశ్నలు వేసుకుంటున్నారు ఉద్యోగులు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఈ వైసీపీ నాయకులకు., మహిళా నేతలకు., బ్లూ మీడియాకు ప్రస్తుతం కళ్ళు కనపడడం లేదా? అంటూ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిక మా వంతు అంటూ టీడీపీ సోషల్ మీడియా కూడా అలర్ట్ అయ్యింది.

వైసీపీ అధినాయకుడు మొదలు వైసీపీ కార్యకర్తల వరకు ఆడవారికి సరైన గౌరవం ఇవ్వడం కూడా తెలియదు అనేది వైసీపీ పార్టీ ఎన్నో సార్లు రుజువు చేసుకుంటుందని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. జగన్ పాలనలో తల్లికి – చెల్లికే దక్కని మర్యాద ఇక సామాన్య మహిళకు దక్కుతుందనేది అత్యాశే అంటున్నాయి టిడిపి శ్రేణులు.

జగన్ తన వ్యక్తిగత స్వార్థంతో గతంలోనూ శ్రీలక్ష్మి అనే మహిళా ఉద్యోగిని అడ్డుపెట్టుకొని చివరకు ఆమెను జైలుకు పంపిన వైనం గుర్తుంచుకొని ఉద్యోగులంతా అప్రమత్తమం ఉండాలని సలహలిస్తున్నారు నెటిజన్లు.