Producers-Got-Apartment-in-Mumbai-for-Telugu-Director-Sandeep-Vangaకబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగా నిన్న ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం అవుతుంది. ప్రేమలో ఉన్న ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే వారి మధ్య నిజమైన ప్రేమ లేనట్టే అని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. బాలీవుడ్ సీనియర్ క్రిటిక్ రాజీవ్ మసంద్ మీద ఆయన చేసిన కామెంట్స్ మిగతా క్రిటిక్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరో వాదన వినిపిస్తుంది. బాలీవుడ్ క్రిటిక్స్ కు తెలుగు వారంటే పడదా? అని కొందరు అనుమాన పడుతున్నారు.

2013లో రామ్ చరణ్ జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అప్పట్లో ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ సినిమా రీమేక్ ను చెడగొట్టిన బాలీవుడ్ డైరెక్టర్ మీద క్రిటిక్స్ విమర్శలు పెద్దగా చెయ్యలేదు. అయితే రామ్ చరణ్ మీద మాత్రం విరుచుకుపడ్డారు. ఆ సినిమా గొప్ప సినిమా అని కాదు గానీ రామ్ చరణ్ మీద ఏదో ప్రత్యేకంగా కసి ఉన్నట్టు వాళ్ళు డీల్ చెయ్యడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పుడు అటువంటి వివక్షతోనే సందీప్ వంగాను కూడా టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి.

అయితే ఈ వివాదంలో ఒకరు చేసిన కామెంట్ ఇక్కడ చెప్పుకోదగినది. “తెలుగు వారంటే వారికి చులకన కావొచ్చు. మనల్ని వారు టార్గెట్ చెయ్యవచ్చు గాక అప్పట్లో బాహుబలితో సమాధానం చెప్పం. ఇప్పుడు కబీర్ సింగ్ తో. రేపు ఆర్ఆర్ఆర్ తో మళ్ళీ నోళ్లు మూయించడం ఖాయం, “అని ఒక అతను అన్నాడు. ఇది ఇలా ఉండగా అర్జున్ రెడ్డి రీమేక్ ఐన కబీర్ సింగ్ 300 కోట్ల క్లబ్ వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. అదే జరిగితే సంచలనమే. ఇప్పటివరకూ 2019లో బాలీవుడ్ లో 300 కోట్ల సినిమాలు లేవు.