Kabir Singh box office recordsతెలుగులో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తీశారు ఆ సినిమా దర్శకుడు సందీప్ వంగా. షాహిద్ కపూర్, కయరా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించినా ఈ చిత్రంపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రఫ్ ఆడించింది. మొదటి వారంలో ఏకంగా 135 కోట్లు కలెక్టు చేసి ఈ ఏడాదిలో మొదటి వారంలో ఎక్కువ కలెక్టు చేసిన సినిమాలలో రెండో స్థానంలో నిలిచి విమర్శకులని సైతం అబ్బురపరిచింది. పూర్తి రన్ లో 200 కోట్లు దాటుతుందని అంచనా.

బాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సర్జికల్ స్ట్రిక్స్ నేపథ్యంలో తీసిన ఉరి… ఇప్పుడు కబీర్ సింగ్ దానిని అధిగమించే అవకాశం ఉంది. ‘కబీర్ సింగ్’ పాత్రలో షాహిద్ కపూర్ నటన ఆయన కెరీర్లోనే బెస్ట్ అని కొనియాడుతున్నారు. కియారా అద్వానీ తన అందచందాలతో కట్టిపడేసిందంటున్నారు. కాకపోతే నటనలో ఇంకాస్త మెరుగుపడాలని అంటున్నారు. మొత్తం మీద ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తెలుగు దర్శకుడు సందీప్ ను అక్కడి నిర్మాతలు ఆఫర్స్ తో ముంచెత్తున్నారట. ఈ మధ్య కాలంలో రాజమౌళి తరువాత బాలీవుడ్ మీద ప్రభావం చూపిన తెలుగు డైరెక్టర్ సందీప్.

దేశమంతటా 3123 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్‌కు ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద క్రేజ్‌ తగ్గడంలేదు. కలెక్షన్ల జోరును చూస్తుంటే.. అలవోకగా ఈ సినిమా ఇంకో వారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు తమిళ్ లో ఆదిత్య వర్మగా తీసిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. కన్నడ రిమేక్ కి కూడా సన్నాహాలు చేస్తున్నారు.