kabali-trailer-hits-first-place-in-youtube-clicksస్టైలుకే స్టైలు నేర్పిస్తాడ‌ని అభిమానులు ఎంత‌గానో కొనియాడే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్‌ లో దుమ్ముదులిపేసింది. 2016 లో యూ ట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఏడాది టాప్‌ 10 ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలు, మ్యూజిక్‌ వీడియోలు, బాలీవుడ్‌ ట్రైలర్ల జాబితాలను యూ ట్యూబ్ తెలిపింది. అందులో “క‌బాలి” హ‌వా కొన‌సాగిన‌ట్లు చెప్పింది. టాప్‌ ట్రెండింగ్‌ ట్రైలర్‌ గా ‘క‌బాలి’ ఉండ‌గా, హిందీలో ప్ర‌సార‌మ‌వుతున్న‌ కపిల్‌శర్మ షోకు సల్మాన్‌ ఖాన్‌ అతిథిగా వెళ్లిన ఎపిసోడ్ టాప్‌ ట్రెండింగ్‌ వీడియోగా ఉంది.

ఆర్‌బీఐ కొత్తగా తీసుకొచ్చిన 2000 నోటుకి జీపీఎస్‌ చిప్ ఉంది అంటూ సోష‌ల్ మీడియాలో ఎన్నో వ‌దంతులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై యూ ట్యూబ్‌లో పెట్టిన వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది యూ ట్యూబ్‌లో సంగీతం అంశాన్ని ప‌రిశీలిస్తే సిద్ధార్థ్‌ మల్హోత్రా, కత్రినా కైఫ్‌ నటించిన ‘కాలా చష్మా’ వీడియో 45 మిలియన్ల వ్యూస్‌ తో టాప్‌లో ఉంది. ఈ ఏడాది టాప్ 10 గా నిలిచిన ఈ వీడియోల‌న్నింటినీ క‌లిపి చూస్తే మొత్తం కలిపి 70 మిలియన్ల మంది చూశారని, వీటి వల్ల త‌మ‌ యూ ట్యూబ్‌ ఛానెల్‌ను 45 మిలియన్ల మంది కొత్తగా సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నారని యూ ట్యూబ్ అధికారులు ప్ర‌క‌టించారు.