ఆన్ లైన్ లో ఫస్ట్ 7 మినిట్స్ మూవీ!

kaasi-sneak-peek-first-7-minutes-vijay-antonyబిచ్చగాడు’ సినిమాతో తెలుగునాట పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ అంటోనీ, ఆ తర్వాత నుండి తన ప్రతి చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే ఎక్కడా విజయం సాధించక చతికిల పడుతోన్న విజయ్, తాజాగా “కాశి” సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పబ్లిసిటీలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి 7 నిముషాల సినిమాను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసారు.

విజయ్ అంటోనీ తన సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వడంతో ఈ తరహా ధోరణిని గతం నుండి అనుసరిస్తూనే వస్తున్నాడు, అందులో భాగంగానే ‘కాశి’ చిత్రాన్ని కూడా ఉంచారు. ‘భరత్’ పాత్రలో విజయ్ యుకేలో డాక్టర్ గా పని చేస్తుండగా, ప్రతి రోజూ కలలో కనిపించే పాముకు సంబంధించిన అంశాలను కనుగొనడానికి ఇండియా రావడం ఈ మొదటి 7 నిముషాలలో ఉంటుంది. తన పూర్వ జన్మతో ముడిపడి ఉందన్న అనుమానంతో ఇండియా వచ్చిన విజయ్, ఏం చేయనున్నాడు? అనేదే మిగిలిన కధ.

పూర్వ జన్మలకు సంబంధించి గతంలో ‘బేతాళుడు’ అనే చిత్రంలో విజయ్ నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ‘కాశి’ మూవీలోనూ పూర్వ జన్మ ఇతివృత్తాన్నే ఎంచుకున్నాడు. విజయ్ ఒకే తరహా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారన్న విమర్శలకు ఇది తావిచ్చినా, ఇలాంటి కధలను ఆసక్తికరంగా, లాజిక్ గా చెప్తే విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సారైనా విజయ్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. ఈ 7 నిముషాల నిడివిలో ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

Follow @mirchi9 for more User Comments

We Are Hiring: Telugu Content Writer; Contact Us at [email protected]

Taxiwala Gets -The Worse Possible Date 16th NovemberDon't MissTaxiwaala Gets The Worse Possible DateAfter months of waiting a date finally has been set for the release of Taxiwala...Rajamouli - Shobu -YarlagaddaDon't MissHeavy Lobbying to Step out of Rajamouli's #RRR?A hundred crores to make a film is in itself a big budget for a...RGV-Prayer-in-Tirupathi-UnpluggedDon't MissRGV's Prayer in Tirupathi UnpluggedRGV is a true atheist who had openly challenged and made fun of Gods on...KTR-Hello-Guru-Prema-KosameDon't MissKTR Disgusted for Watching That MovieCan the leaders have a normal life at the others? Or their life should only...Aravinda-Sametha-2-MillionDon't MissNTR Hits the 2 Million Mark Again!After a considerably long wait, NTR's Aravinda Sametha hits the 2 Million Mark at the...
Mirchi9