Kaala movie premier talk‘కబాలి’ వంటి దారుణమైన పరాజయం తర్వాత కూడా, ఆ చిత్ర దర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ మరో అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ సారైనా దానిని రంజిత్ సద్వినియోగం చేసుకున్నారా? అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేలా చిత్రాన్ని తెరకెక్కించారా? అంటే… ‘కబాలి’తో పోలిస్తే ‘కాలా’ చాలా విషయాలలో ఊరటనిచ్చే చిత్రంగా నిలిచిందన్నది ప్రీమియర్స్ టాక్.

స్టోరీకి లోబడి ఎక్కడా అతి చేయకుండా, రజనీ మేనరిజమ్స్ కు లోటు లేకుండా తీర్చిదిద్దిన విధానం… ఈ సారి ‘పాస్’ మార్కులను వేయించుకున్నాయి. అందులోనూ ఈ సినిమాపై ఎవరూ ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోవడం కూడా సినిమా టాక్ కు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అభినయం పరంగా రజనీ, నానా పటేకర్ లు సిల్వర్ స్క్రీన్ పై మైమరిపించగా, సాంకేతిక విభాగాల్లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి.

క్లైమాక్స్ లో కాస్త గందరగోళం, సినిమాటిక్ అంశాలు కనిపించినప్పటికీ… సూపర్ స్టార్ గత చిత్రాలతో పోలిస్తే “కాలా” టాక్ ‘ఓకే’ అనిపిస్తుంది. ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్న ఈ సినిమాకు, ‘జస్ట్ ఓకే టాక్’ ప్రేక్షకులను ధియేటర్లకు రప్పిస్తుందో లేదో వేచిచూడాలి. యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా సూపర్ స్టార్ రేంజ్ లో లేకపోవడం ఈ సినిమాపై ప్రేక్షకులకున్న అంచనాలను తెలియజేస్తోంది.