ఇప్పటివరకూ విడుదలైన రెండు ట్రయిలర్లను బట్టి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లను గట్టిగానే టార్గెట్ చేశాడని స్పష్టం అవుతుంది. దీనిపై టీడీపీ అభిమానులు రగిలిపోతున్నారు. వారు దీనిపై కోర్టుకి వెళ్ళాలని కోరుకుంటున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో మౌనం వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా కేఏ పాల్ ఈ చిత్రంపై హైకోర్టుని ఆశ్రయించారు. తన క్యారెక్టర్‌ను అవమానపరిచే విధంగా సినిమాలో చూపించారని, సినిమా విడుదలను ఆపివెయ్యాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు.
ఇందులో కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రామ్‌గోపాల్ వర్మ, కమెడియన్ రాము, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు కేఏ పాల్. కాసేపట్లో పాల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ఈ నెల 29న విడుదలకు సిద్ధం చేస్తున్నది చిత్రబృందం. అయితే టీడీపీ అభిమానులు పాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు కంటే నువ్వే బెటర్… కనీసం ధైర్యం చుపించావు అంటున్నారు. పాల్ గనుక సినిమా విడుదలపై స్టే తేగలిగితే మరింత పొగడ్తలతో ముంచెత్తే అవకాశం ఉంది.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
SVP Result: A Wakeup Call To Jagan?